1933నాటి బెజవాడ కృష్ణాపుష్కర విశేషాలు
అన్ని బ్లాగులు ముందుకు పోతూవుంటే ఈ బ్లాగు ఎంతలేదన్నా వెనకడుగువేస్తూవుంటుంది, అసలే పుష్కరకాలంఅని 2016 నుండి పన్నెండువత్సరాల చొప్పున వెనక్కిపోతే 1932లో వచ్చి వుంటాయిలే అనుకున్న పుష్కరాలు అధికమాసాల మూలంగా...
View Articleరతిచేతి రాచిలుక – మనమే నందనవనం
శ్రీ వి. ఎ. కె. రంగారావు గారి సారధ్యంలో 1988లో వచ్చిన జంట క్యాసెట్ల టైటిల్స్ ఇవి. వీటిల్లో ఎక్కువ పాటలు శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రాసినవే. చక్కటి సంగీత సాహిత్యాలతో కూడిన పాటలు ఇవి. ఆ పాటల...
View Articleశతావధానము – శ్రీ వేలూరి శివరామ శాస్త్రి గారు
ఆంధ్రులకే సొంతమైన విశేష ప్రక్రియ ఈ అవధానకళ. మరి ఈ అవధానము గురించి ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రిక 1959 నాటి స్వర్ణోత్సవ సంచికలో వచ్చిన, శతావధాని శ్రీ వేలూరి శివరామ శాస్త్రి గారి అరుదైన వ్యాసం చూద్దాము.
View Articleకల్లోల గౌతమి, వెల్లువలె కృష్ణమ్మ – పద్యాలు, గేయాలు, పాటలు
గోదావరి అంత్య పుష్కరాలు, కృష్ణా పుష్కరాల తరుణంలో ప్రసిద్ధ కవుల పద్యాలు, గేయాలు చూద్దాము. ఆంధ్రప్రశస్తికి సంబంధించిన గేయాలన్నిటిలో కృష్ణా గోదావరి నదుల ప్రస్తావన వస్తూనే వుంటుంది. ఇవన్నీ పాత పుస్తకాలు,...
View Articleకృష్ణా పుష్కర సంరంభం
కృష్ణా పుష్కరాల సంధర్భంగా కృష్ణానది పుట్టుక, నదీతీరమందలి 128 తీర్ధముల వివరాలు, పుష్కరుడి వృత్తాంతం, కృష్ణవేణి నది పూజావిధానము, 1921 నాటి కృష్ణా పుష్కర విశేషములు తెలుసుకుందాము. అందరూ కృష్ణా తీరంలోని 60...
View Articleసాహితీ కృష్ణా తరంగిణి – ఆకాశవాణి ప్రసారం
కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రసారమైన శ్రీ అద్దంకి శ్రీనివాస్ గారి ప్రసంగం “సాహితీ కృష్ణా తరంగిణి” వినండి. ...
View Articleజ్యోతిలక్ష్మి - హేర్ ఆయిల్ ప్రకటన
వెండితెర మీద తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పాటుచేసుకున్న జ్యోతిలక్ష్మి గారు ఒక హేర్ ఆయిల్ కోసం ఇచ్చిన ఒక అరుదైన ప్రకటన చూడండి. ఇదివరలో “అలనాటి వాణిజ్య ప్రకటనలు” శీర్షిక కింద తారల లక్స్ సబ్బు ప్రకటనలు...
View Articleపుణ్య పుష్కరము – ఏకాంకిక నాటకము
పుష్కర ఆవిర్భావ వృత్తాంతం తెలియజేసే, శ్రీ ముదిగొండ కోటయ్య శాస్త్రి గారి నాటకం ఒకటి 1945 నాటి కృష్ణా పుష్కరాల సందర్భంగా భారతిలో వచ్చింది. ముందుగా శ్రీ తాడేపల్లి పతంజలి గారి లఘు ప్రసంగం విందాము. చివరగా...
View Articleదుర్గాబాయ్ దేశముఖ్ గారి స్వరం విన్నారా
స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకొని స్వాతంత్ర్య సమరయోధురాలు దుర్గాబాయ్ దేశముఖ్ గారి స్వరం విందాము. ఆవిడ స్వరం ఎంత లలితంగా ఉందో వినిచూడండి. ఆకాశవాణి వారి ప్రసారం. ముందుగా “మేలుకొనుమీ భరతపుత్రుడ”...
View Articleవచ్చింది శ్రావణి – పాలగుమ్మి వారి సంగీత రూపకం
శ్రావణమాసం సందర్భంగా శ్రీ పాలగుమ్మి విశ్వనాధం గారి సంగీత రూపకం “వచ్చింది శ్రావణి”, ఆకాశవాణి వారి ప్రసారం. రచన గంగరాజు సుశీలాదేవి, ఇందులో ఎ. లక్ష్మి, మాలతీలత, టి. ఇందిర, జ్యోత్స్నదేవి, పాకాల...
View Articleశ్రీరంగం గోపాలరత్నం గారు పాడిన సప్తపది – సాహిత్యం, అధ్బుత చిత్రాలు
ధనుర్మాసంలో వినవచ్చే “తిరుప్పావై – సప్తపది” రేడియో ప్రసారంలో శ్రీరంగం గోపాలత్నం గారు పాడిన తెలుగు పద్యాలను రచించినది ఎవరు అన్నది తెలియరాలేదు. తిరుప్పావై పుస్తకాలు చాలా చూసినా ఆ పద్యాలు మటుకు దొరకలేదు....
View Articleబిరబిరా కృష్ణమ్మ – పద్య కవితా గానం – ఆకాశవాణి
కృష్ణా పుష్కరాలను పురస్కరించుకొని రేడియోలో ప్రసారమైన బిరబిరా కృష్ణమ్మ – పద్య కవితా గానం. ఇందులో పాల్గొన్నవారు తిరుమల శ్రీనివాసాచార్యులు గారు, రావికంటి వసునందన్ గారు, అయాచితం నటేశ్వరశర్మ గారు, పులిపాక...
View Articleకరుణశ్రీ గారి పద్యాలు – ఘంటసాల గారి గళంలో
కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి అద్వైతమూర్తి, కరుణామయి, సాంధ్యశ్రీ, ప్రాభాతలక్ష్మి పద్యాలు ఘంటసాల గారి గళంలో విందాము. వాటి సాహిత్యం కొన్ని చిత్రాలు సమకూర్చటం జరిగింది. వీరి పద్యాలకు కొన్నింటికి...
View Articleహాల శాతవాహన – యక్షగానం – బాలాంత్రపు రజనీకాంతరావు గారు
శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారి రచన, నిర్వహణలో “హాల శాతవాహన” యక్షగానం విందురుగాని. ఇందులో పాల్గొన్న కళాకారుల పేర్లు ప్రకటించలేదు. ఇది గుణాధ్యుడి “బృహత్కధ” వృత్తాంతం. దీని పూర్వాపరాలు రజని గారి...
View Articleమా కొద్దీ తెల్లదొరతనము – శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ
స్వాతంత్ర్యోద్యమకాలంలో “మా కొద్దీ తెల్లదొరతనము” గేయం ద్వారా ప్రజలలో ఉత్తేజాన్ని కలిగించినవారు శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారు. ఈ గేయాన్ని ఎలా పాడాలి, దీని ట్యూన్ ఏమిటి అన్న సందేహాలు కలుగుతూ ఉంటాయి....
View Articleమార్గదర్శి గురజాడ – శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ప్రసంగ వ్యాసం
ఇది 1946లో గురజాడ వారి సంస్మరణ సభలో శ్రీపాదవారు చేసిన ప్రసంగ పాఠం. స్రవంతి సంచికలో పునఃముద్రణ. మహాకవి గురజాడ వారి గురించి శ్రీపాద వారు చెప్పిన విషయాలేమిటో చూద్దాము. “పిల్లలు” గురజాడ వారి “మాట – మంతి”...
View Articleహరహర మహాదేవ – రేడియో నాటిక – సత్యం శంకరమంచి
“అమరావతి కధలు” రచయిత శ్రీ శంకరమంచి సత్యం గారి రచన, పర్యవేక్షణలో వచ్చిన రేడియో నాటిక “హరహర మహాదేవ” వినండి. ఇందులో సి. రామ్మోహనరావు, ఎస్. పూర్ణానంద శాస్త్రి, ఎ. బి. ఆనంద్, వి. బి. కనకదుర్గ, ఎం....
View Articleగణేశ మంగళాచరణం
ఆదిపూజ్యుడైన వినాయకుడి మీద ఒక కీర్తన వింటూ కొన్ని చిత్రాలు చూద్దాము. . ఎల్లరకు వినాయక చవితి శుభాకాంక్షలు. ..
View Articleకె. జమునారాణి గారితో ఆకాశవాణి వారి విశిష్ఠ పరిచయ కార్యక్రమం
78వత్సరాల వయస్సులో ప్రముఖ గాయనీమణి కె. జమునారాణి గారు ఆకాశవాణి వారికి ఇచ్చిన ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఇది. పరిచయం చేసినవారు శ్రీ అంబడిపూడి మురళీకృష్ణ గారు. ఈ రికార్డు ఒక గంటన్నర సేపు వినవస్తుంది.
View Articleసజీవ స్వరాలు – శ్రీ ప్రతివాద భయంకరాచారి గారు
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ ప్రతివాద భయంకర వెంకటాచారి (1910-1978) గారి జ్ఞాపకాలు విందాము. వీరు కాకినాడ బాంబు కేసులో అండమాన్ జైలుకు పంపబడ్డారు. వీరి గురించిన మరింత సమాచారం ఈ లింకు ద్వారా...
View Article