గత నాలుగుఏళ్లుగా విభిన్నాంశాలతో సాగుతున్న శోభనాచలారోహణంలో ఇవాళ 700వ మెట్టుకు చేరుకున్నాము. తిరుపతి వేంకటకవుల శిష్యులు, 1933 లో ‘సావిత్రి’ సినిమాగా తీయబడ్డ ‘సావిత్రి’ నాటకకర్త, స్వయానా మాతాతగారు అయిన శ్రీ శ్రీరాముల సచ్చిదానంద శాస్త్రి గారి గురించిన కొన్ని జ్నాపకాలను పదిలపరచే ప్రయత్నంలో భాగమే ఈ 700వ పోస్టింగ్.
మాతాతగారు 1888లో జన్మించారు. వీరు బెజవాడ హిందూ హైస్కూలులో పండితుడిగా పనిచేశారు
↧