“ధర్మసందేహాలు” దీనికి ఆద్యులు ఉషశ్రీ గారు. రేడియోలో విజయవాడ కేంద్రం నుండి మధ్యాహ్నంపూట వచ్చిన వీరి కార్యక్రమం గుర్తుండే ఉంటుంది. అలాగే బహుకాలంపాటు స్వాతి మాసపత్రికలో వచ్చిన మల్లాది వారి “పురాణ విజ్ఞానం” కూడా అంతే ప్రాచుర్యం పొందినది. మాసపత్రిక రాగానే మొదటగా ధర్మసందేహాలనే చదవాలనిపించేది. స్వాతి మాసపత్రికవారు పదిలపరచుకోటానికి వీలుగా, వీటిని ప్రత్యేక అనుబంధ సంచికలుగా కూడా తీసుకువచ్చారు.
↧