మన పెద్దవాళ్ళు ‘పంతులుగారు’ అంటూ ఆప్యాయంగా పిలుచుకొనే వారిలో మనకు వినబడే పేర్లు కందుకూరి, కాశీనాధుని, టంగుటూరి, గిడుగు, చిలకమర్తి. ఆ కోవలో వారే శ్రీ ముట్నూరి కృష్ణారావు పంతులు గారు. ఆంధ్రపత్రిక, గోల్కొండపత్రిక పేర్లు వినగానే మనకు కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారు, సురవరం ప్రతాపరెడ్డి గారు ఎలా గుర్తుకు వస్తారో, కృష్ణాపత్రిక పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది శ్రీ ముట్నూరి కృష్ణారావు పంతులు గారు. ముట్నూరి వారిపై ‘మా గురుపాదులు’ అంటూ రావూరు వారు రాసిన ఒక వ్యాసం కృష్ణాపత్రిక వజ్రోత్సవ సంచికలో వచ్చింది. అది ఇప్పుడు చూద్దాము.
రావూరి వారి ‘వడగళ్ళు’ కృష్ణాపత్రికలో (అచ్చు)పడ్డాయిట. ఇప్పటికి ఆ వడగళ్ళు కొన్ని రావూరి వారి కుమార్తె జ్ఞానప్రసూనగారి బ్లాగులో, మరికొన్ని మాగంటివారి వెబ్సైటులో ‘వ్యాసావళి’శీర్షికలో కరగక నిలిచి వున్నాయి. ఒకసారి ఆ వడగళ్ళు రుచి చూడండి.
ఈనాడు వారిది “తెలుగువెలుగు” అనే విశిష్ఠ మాసపత్రిక వస్తుంది. ఇది కొని చదివితే చాలా బావుంటుంది. మరి దొరకని వారు ఇదిగో ఈ లింకుద్వారా చదివి ఆనందించండి. విశేషం ఏమిటంటే ఏప్రిల్ 2015 సంచికలో 70, 71 పేజీల్లో మాగంటి వంశీ గారి గురించి, వారి వెబ్సైట్ గురించి ఒక వ్యాసం ప్రచురించారు. మరి దూరతీరాల్లో ఉన్నవారు ఆ ‘తెలుగువెలుగు’ ను ఆస్వాదించండి.
Tags: Mutnuri Krishnarao, Mutnoori, Raavuri Venkata Satyanarayana, Raavoori, Ravuri, Krishna Patrika,