ఆంధ్రపత్రిక సచిత్రవారపత్రిక ముఖచిత్రాలుగా వచ్చిన శ్రీ గెనిసెట్టి గారి చిత్రాలు చూద్దాము. వారపత్రికల ముఖచిత్రాలుగా సినిమా తారల చిత్రాలే ఎక్కువగా అలరిస్తూవుంటాయి. చిత్రకారులను ప్రోత్సహించడానికి ప్రత్యేక సంచికలకు వారు గీసిన చిత్రాలను ప్రచురిస్తూవుంటారు. పాత సంచికలలో లోపలి పుటలలో కూడా మంచిమంచి వర్ణచిత్రాలు ప్రచురించేవారు. ఈ క్రమంలో ఎంతోమంది చిత్రకారుల అరుదైన చిత్రాలు ఎన్నో చూస్తూవస్తున్నాము.
↧