ఆ రోజుల్లో ఏదన్నా కొత్త ఆవిష్కరణ జరిగితే ఇదేదో ప్రపంచ వినాశనానికే పుట్టిందని భయపడేవారుట. రైళ్ళు వచ్చిన కొత్తల్లో ఇనుపదయ్యం వచ్చిందన్నారుట, పోస్ట్ కార్డు వచ్చినప్పుడు ప్రజల రహస్యాలను తెలుసుకోటానికి ప్రభుత్వం పన్నిన పన్నాగమన్నారుట, ఇంగ్లాడులో గొడుగులు కనిబెట్టినప్పుడు వాటినిచూసి కుక్కలు మొరిగాయిట, అలాగే గ్రామఫోన్ రికార్డు వచ్చినప్పుడు కూడా ఆ పెట్టెలో ఎవరో దాక్కొని పాడుతున్నారని అనుకోనేవారుట.
↧