శ్రీ అడివి బాపిరాజు గారు “ఆంధ్ర వనితామణులు – చిత్రకళ” అనే వ్యాసంలో సోదరీమణులైన రత్నాల కృష్ణాబాయి, రత్నాల కమలాబాయి గార్ల గురించి పేర్కొనటం జరిగింది. వీరివరకు సంబంధించిన వ్యాసంతోపాటు, కమలాబాయి గారివి ఓ మూడు చిత్రాలు పోస్ట్ చెయ్యటం జరిగింది. సాధారణంగా చిత్రకారులు వారి చిత్రాలకు ఒక పేరంటూ పెట్టుకుంటారు. కాని కింద చిత్రాలు చూస్తే, ఒకే చిత్రం మూడు సందర్భాలలో ప్రచురించినప్పుడు మూడు రకాలుగా పేర్కొన్నారు, పైగా చిత్రకారుల పేరు ప్రచురించలేదు. చిత్రం మీది చిత్రకారుని సంతకం బట్టి గుర్తించటం ఒక్కోసారి కష్టంగా ఉంటుంది.
Tags: Rathnala Kamalabai, Rathnala Krishnabai, Adivi Bapiraju, Telugu chitrakarulu, Old paintings, Varna Chitralu